MHBD: కురవి మండల కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. ఒకేరోజు రాత్రి అనేకచోట్ల చోరీకి పాల్పడ్డారు. శ్రీ వీరభద్రస్వామి ఆలయ సమీపంలో సాయి ఆటో మొబైల్ షాపుల వెనుక ఉన్న తలుపులు పగలకొట్టి రూ.10వేల నగదు అపహరించారు. అలాగే శ్రీవినాయక ఫొటోస్& రేడియం వర్క్స్, HR సెల్ మార్ట్ లలో తలుపులను ధ్వంసం చేసి చోరీకి యత్నించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.