AP: త్వరలో గ్రామ పంచాయతీల పునర్వర్గీకరణ జరిగే అవకాశం ఉంది. ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా పునర్వర్గీకరించాలనే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆదాయాన్ని బట్టి 13,351 పంచాయతీలను 4 గ్రేడ్లుగా విభజించాలని, అలాగే పంచాయతీ సెక్రటరీలను పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్గా మార్చాలని నిర్ణయించింది.