MDK: పాపన్నపేట మండలం పొడ్చన్ పల్లి తండాలో కేతావత్ విజయ్ కుమార్ (32) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. రెండు రోజులుగా దిగులుగా ఉన్న విజయ్ గురువారం ఇంటి నుంచి బయటకు వెల్లి తిరిగి రాలేదు. శుక్రవారం తండా సమీప అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకున్నట్లు కుటుంబీకులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.