WGL: వరంగల్‌కి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ ఇటీవల తమిళనాడులో జరిగిన కరాటే మహోత్సవంలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి ప్రపంచస్థాయి గౌరవం సంపాదించాడు. ఈ క్రమంలో శుక్రవారం ఆ బాలుడిని వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్ అభినందించారు. అద్భుత ప్రదర్శనతో జిల్లాకు, రాష్ట్రానికి పేరు తేవడం గర్వకారణమని అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.