ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో తహసీల్దారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ మేరకు సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అత్యధికంగా రెవెన్యూ సమస్యలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, తహసీల్దార్లు రెవెన్యూ సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.