AKP: అనంతపురంలో ఈనెల 13 నుంచి జరిగే ఐద్వా రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఐద్వా నాయకులు ఎల్.గౌరీ, కేవీ.సూర్యప్రభ తెలిపారు. నర్సీపట్నంలో శుక్రవారం మహిళలతో సమావేశమయ్యారు. ప్రభుత్వాలు మారుతున్న మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. రాత్రి సమయాల్లో కూడా మహిళలు పని చేయాలని కూటమి ప్రభుత్వం చట్టం చేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు.