E.G: గోకవరం మండలంలోని తానా సెంటర్ వద్ద శుక్రవారం వాహన తనిఖీల్లో భాగంగా స్కూటీపై గంజాయి తరలిస్తున్న రాజమండ్రికి చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 11 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కోరుకొండ సీఐ సత్య కిషోర్ తెలిపారు. ముద్దాయిలు చింతల మురారి, సూరి హేమంత్, దూలపల్లి నానిలను అరెస్ట్ చేశామన్నారు.