నోబెల్ శాంతి బహుమతి అందుకోవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కల ఈసారి తీరలేదు. ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారానికి వెనెజువెలా విపక్ష నేత మారియా కొరీనాను ఎంపిక చేసినట్లు అకాడమీ ప్రకటించింది. దీనిపై అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ స్పందించింది. శాంతి స్థాపన కంటే రాజకీయాలకే ప్రాముఖ్యత ఇచ్చారంటూ విమర్శలు గుప్పించింది.