ప్రకాశం: అనుమతులు లేకుండా బాణసంచా నిల్వ ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని కొండపి సీఐ సోమశేఖర్ అన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం పొన్నలూరులోని పలు షాపుల్లో SI అనూక్తో కలిసి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. బాణసంచా నిల్వ ఉండాలంటే విధిగా అనుమతులు పొంది ఉండాలన్నారు. అనంతరం తాత్కాలికంగా బాణసంచా విక్రయించాలన్నా అనుమతులు తప్పనిసరిగా పొందాలని తెలిపారు.