NZB: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షనర్ల పట్ల వివక్ష ప్రదర్శిస్తూ వారి ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నాయని పెన్షనర్ల యూనియన్ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ అన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సివిల్ పెన్షనర్లు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన కొత్త చట్టం కారణంగా ప్రయోజనాలు ఉండబోవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.