KMR: బిక్కనూరు మండలం గురుజకుంటలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన అన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు. ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.