MBNR : బాలానగర్ గ్రామపంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మండలంలో బాలానగర్ పెద్ద గ్రామపంచాయతీ. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా ఉంటుంది. చిన్న తగాదాలకు బాధితులు గ్రామ సర్పంచ్‌ను ఆశ్రయిస్తారు. తగాదాల పరిష్కారానికి రూ.లక్షల డిమాండ్ ఉంటుందని సమాచారం. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రస్తుత గ్రామపంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు సర్పంచ్‌గా గెలవాలని పట్టుదలతో కృషి చేస్తున్నారు.