ADB: జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల ప్రభుత్వ వసతి గృహాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ వంద శాతం ప్రవేశాలు కల్పించాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లాలో పర్యటించి పలు వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు చదువుతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.