SRPT: ఈనెల 25న హుజూర్ నగర్లో నిర్వహించే మెగా జాబ్ మేళాను KRR డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు ఉపయోగించుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ రాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ సర్టిఫికెట్లు, బయోడేటాతో హాజరు కావాలన్నారు. జాబ్ మేళాకు హాజరయ్యే విద్యార్థులకు బస్సులో ఉచిత ప్రయాణం, భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు.