SDPT: సిద్దిపేట మండలం చింతమడకలోని సీతారామచంద్రస్వామి ఆలయ నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన, శ్రీరామనవమి వేడుకలకు రావాలని మాజీ సీఎం కేసీఆర్ను ఆలయ కమిటీ ఆహ్వానించింది. బీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల వంశీధర్ రావు ఆధ్వర్యంలో ప్రతినిధులు కేసీఆర్ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 25, 27 తేదీల్లో ఈ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.