ADB: ఉట్నూర్ మండలం రాజన్న గూడకు చెందిన గడ్డం భగవాన్ 2024 సెప్టెంబర్ 13న మద్యం మత్తులో తండ్రిని చంపాడు. డబ్బుల కోసం తలపై దాడిచేయడంతో చికిత్స పొందుతూ అతడి తండ్రి మృతి చెందాడు. కేసు నమోదు చేసిన ఉట్నూర్ పోలీసులు నిందితుడిని నేడు కోర్టులో హాజరుపరచగా విచారణంలో నేరం రుజువు కావడంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు అతడికి 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించారు.