GDWL: అయిజ మండలం చిన్న తాండ్రపాడులో సత్యమాంబ ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఎద్దుల బండలాగు పోటీలు అలరించాయి. ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ యూనియన్ ఛైర్మన్ సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎద్దుల జతలు పాల్గొన్నాయి. విజేతలకు సాయంత్రం నగదు బహుమతులు, షీల్డ్స్ అందజేసి రైతులను అభినందించారు.