మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని 21 వ డివిజన్ శ్రీనివాస్ కాలనీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా గురువారం రాత్రి ఎదుర్కోళ్ళ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతమ్మ విగ్రహాన్ని ఊరేగించారు. అర్చకులు మాట్లాడుతూ శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు.