RR: చెరువులతో పాటు ఎస్టీపీలు సిద్ధం కావాలని, అప్పుడే చెరువుల పునరుద్ధరణ ప్రయోజనం ఉంటుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. రాజేంద్రనగర్ మండలం ఇబ్రహీంబాగ్ చెరువును సందర్శించి పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పూడిక ఏమాత్రం లేకుండా తొలగించాలని అప్పుడే చెరువుల దుర్గంధం వదులుతుందన్నారు.