MDK: శివంపేట మండలం చిన్న గొట్టిముక్కుల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తూప్రాన్ నర్సాపూర్ ప్రధాన రహదారిపై బుధవారం అతివేగంగా వచ్చిన ఒక కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో కారు రోడ్డు కిందికి దూసుకెళ్లి బోల్తాపడడంతో కారులో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో నర్సాపూర్ ఏరియా హాస్పిటల్ తరలించారు.