ASF: భారత దేశ స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని DYIF జిల్లా కార్యదర్శి గుడిసెల కార్తీక్ అన్నారు. ఆదివారం ఆసిఫాబాద్ పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో భగత్ సింగ్ 95వ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. అదేవిధంగా విద్యార్థులకు కబడ్డీ, చెస్ పోటీలు ఏర్పాటు చేశారు. ఉన్నత చదువులు చదివి మంచి స్థాయిలో ఉండాలని ఆయన పేర్కొన్నారు.