ASF: కాగజ్‌నగర్ మండలంలో కుల, నివాస, ఆదాయం ధృవపత్రాల జారీ వేగవంతం చేయాలని RTI సభ్యులు కోరారు. ఈ మేరకు గురువారం MRO మధుకర్‌కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. ధృవపత్రాల జారీకి ఆలస్యం కావడంతో విద్యార్థులు, నిరుద్యోగులు, లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆఫీస్‌లో సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.