KNR: హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో విద్య, వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని నిధులు మంజూరు చేసిందని, మరిన్ని నిధులు తీసుకొచ్చి పూర్తి చేస్తామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ప్రణవ్ అన్నారు. కేసీక్యాంపులో గల మహాత్మా జ్యోతి బా పూలే పాఠశాలలో రూ. 30 లక్షలతో అదనపు తరగతుల నిర్మాణానికి భూమి పూజ చేశారు.