SDPT: కుకునూరుపల్లిలోని బస్టాండ్ ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో విద్యుత్ స్తంభం విరిగి ప్రమాదకరంగా మారింది. రోజులు గడుస్తున్నా అధికారులు స్పందించకపోవడంతో వాహనదారులు, బాటసారులు భయాందోళన చెందుతున్నారు. ప్రధాన రహదారి కావడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి విరిగిన స్తంభాన్ని తొలగించారు.