WGL: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పర్వతగిరి మండలం ఇస్లావత్ తండాలో గిరిజనులు ప్రత్యేక పూజలు చేశారు. తండాలోని వాగ్ జాయి మాతను తండావాసులు భక్తిశ్రద్ధలతో పూజించి, మొక్కులు చెల్లించుకొని, నైవేద్యాన్ని సమర్పించారు. పాడి పంటలు బాగా పండాలని, పిల్లాపాపలు ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించాలని వేడుకున్నారు. ప్రతియేటా ఉగాదినాడు పూజలు నిర్వహిస్తామని తెలిపారు.