SDPT: ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తే అక్రమ అరెస్టులు చేయడం సిగ్గుచేటని టీయూ జేఏసీ దుబ్బాక నియోజకవర్గ ఛైర్మన్ సూకురి లింగం అన్నారు. అసెంబ్లీ ముట్టడికి యత్నిస్తారనే నేపథ్యంలో ముందస్తుగా లింగంతో పాటు మల్లుపల్లి భూపతి గౌడ్ తదితరులను అదుపులోకి తీసుకొని మిరుదొడ్డి పోలీస్ స్టేషన్కు తరలించారు. వారు మాట్లాడుతూ.. ప్రజా పాలన అంటే రాత్రికి రాత్రే అరెస్టుల? అని ప్రశ్నించారు.