SRD: నారాయణఖేడ్ పట్టణంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ దొడ్డి కొమరయ్య కురుమ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక డబుల్ బెడ్ రూమ్ పక్కనే ఉన్న దొడ్డి కొమరయ్య విగ్రహానికి కురుమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మల్గొండ, నియోజకవర్గం సంఘ అధ్యక్షుడు లోన్డే నర్సింలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఇందులో నాయకులు నవనాథ్, నర్సన్న, మల్లేష్, భీమన్న ఉన్నారు.