SRPT: నడిగూడెంను ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గంగా ప్రకటించాలని కోరుతూ సాధన కమిటీ ఛైర్మన్ బెల్లంకొండ నవీన్ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. రాజా నాయని పాలన, పింగళి వెంకయ్యతో అనుబంధం, గ్రంథాలయ ఉద్యమం వంటి ఘన చరిత్ర ఉన్న నడిగూడెంకు రాజకీయ గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భోనగిరి ఉపేందర్, పందిటి నవీన్ తదితరులు పాల్గొన్నారు.