NRPT: మక్తల్ మండలం బొందల కుంట నుంచి మంథన్ గోడ్ వరకు బీటీ రోడ్డు మంజూరు చేయాలని గురువారం మాజీ ఎంపీటీసీ వెంకటరాముడు, జిల్లా ఉపాధ్యక్షుడు కర్ణి స్వామి ఎంపీ డికే అరుణను కలిసి వినతి పత్రం అందజేశారు. బీటీ రోడ్డు లేక ప్రయాణికులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అదేవిధంగా మండలంలోని గ్రామాలలో అభివృద్ధి పనుల కోసం సైతం ఎంపీ నిధులు కేటాయించాలని కోరారు.