NGKL: ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఊర్కొండ ఏఎస్సై గఫార్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగం వల్ల కలిగే ప్రమాదాల గురించి వాహనదారులకు వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది హర్ష, కృష్ణ, నవ్య, స్వాతి పాల్గొన్నారు.