PDPL: రామగుండం రైల్వే స్టేషన్ ఏరియాలోని శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంలో 30వ వార్షికోత్సవ కార్యక్రమం గురువారం నిర్వహించారు. లోక కళ్యాణార్థం 108 మంది పుణ్య దంపతులతో శ్రీ ఆంజనేయ స్వామి మహా యాగం కన్నుల పండువగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య మహా యాగం,అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ఛైర్మన్ సతీశ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.