GDWL: మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. మార్చి నెలలో 19 అవగాహన సదస్సులు నిర్వహించి, వేధింపులకు పాల్పడిన 11 మందిపై కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండి సమస్యలుంటే డయల్ 100 లేదా 8712670312కు ఫిర్యాదు చేయాలని సూచించారు. షీ టీమ్స్ నిరంతరం నిఘా ఉంచుతాయని తెలిపారు.