PDPL: సుల్తానాబాద్ పట్టణ శివారు శాస్త్రినగర్ లో రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఓ ఆర్టీసీ ఢీకొట్టడంతో మృతి చెందాడు. పూసాల గ్రామానికి చెందిన బావు కొమురయ్య(79) మంగళవారం బ్యాంకులోకి వెళ్లి డబ్బులు డ్రా చేసుకుని తిరిగి వస్తుండగా ఆర్టీసీ ఢీ కొట్టింది. ఈ సంఘటనలో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు.