MBNR: సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయిపై జరిగిన దాడి న్యాయవ్యవస్థ పై జరిగిన దాడిగా భావిస్తున్నామని జిల్లా ఆర్టీఐ పరిరక్షణ సమితి అధ్యక్షులు ఏర్పుల నాగరాజు అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కొందరు మనువాదులు సనాతన ధర్మం పేరుతో, దేవుడి పేరుతో, మత విశ్వాసాల పేరుతో మానవత్వాన్ని మరిచి మనిషిని మనిషిగా చూడటం మర్చిపోయారని అన్నారు.