GDWL: గట్టు మండలంలో MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇవాళ పర్యటన చేశారు. చిన్నోనిపల్లి రిజర్వాయర్ కింద ఉన్న వాగును పరిశీలించారు. బోయలగూడెం, చిన్నోనిపల్లి, అంతంపల్లి, లింగాపురం నుంచి అయిజకు వెళ్లే రహదారి మధ్యన ఉన్న ఈ వాగుపై బ్రిడ్జి లేకపోవడం వల్ల రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు బ్రిడ్జి నిర్మాణానికి త్వరలో చేపడతామని MLA తెలిపారు.