NRML: రేపు జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్‌ను నిశితంగా పర్యవేక్షించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో వెబ్‌కాస్టింగ్‌లో ఏవైనా లోపాలు తలెత్తితే వెంటనే సంబంధిత కేంద్రాలతో సంప్రదించి పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.