MHBD: తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమంపై విద్యార్థులకు వైద్యులు ఇవాళ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మీరాజ్, మానసలు మాట్లాడుతూ… మానసిక సమస్యలు ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తాయని, మానసికంగా, దృఢంగా ఉంటేనే శరీరక ఆరోగ్యం సక్రమంగా ఉంటుందన్నారు.