KNR: జమ్మికుంట బాలుర ఉన్నత పాఠశాలలో ఇవాళ డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఆకునూరి మురళి కమిషన్ నివేదికపై చర్చించనున్నట్లు జోన్ అధ్యక్షుడు ఏబూషి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు లింగారెడ్డి, రాజిరెడ్డి, రఘు శంకర్ రెడ్డి హాజరుకానున్నారు. ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.