HYD: నగరంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్) గురువారం ప్రారంభం కానుంది. ఈ ఏడాది నుమాయిష్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిసి ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పారిశ్రామిక, వ్యాపార సంస్థలు ఈ ప్రదర్శనలో తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి.