HYD: జలమండలి పేరుతో ప్రైవేట్ ట్యాంకర్లు నీటి సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని HMWSSB హెచ్చరించింది. ఇలాంటి ట్యాంకర్ల నీరు శుద్ధి చేయబడినది కాకపోవడంతో ఆరోగ్యానికి హానికరం కావచ్చని చెప్పారు. ట్యాంకర్ బుకింగ్ కోసం తప్పనిసరిగా 155313 ద్వారా మాత్రమే సంప్రదించాలని సూచించారు. ఇప్పటికే ఒక ట్యాంకర్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.