HYD: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్ర స్థాయి మినహా అన్ని కమిటీలను రద్దు చేశారు. త్వరలోనే నూతన కమిటీల నియామకానికి ఆదేశాలిచ్చారు. వారికి శిక్షణా తరగతులు నిర్వహించే కీలక బాధ్యతలను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అప్పగించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేటీఆర్ ఈ ప్రక్రియను పర్యవేక్షించాలన్నారు.