ADB: జైనథ్ సర్కిల్ కార్యాలయానికి నూతన సీఐగా హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ విభాగం నుంచి శ్రావణ్ కుమార్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మర్యాదపూర్వకంగా పూలమొక్క అందజేసి బాధ్యతలను స్వీకరించారు. జైనథ్ సర్కిల్ పూర్తిగా మహారాష్ట్రతో సరిహద్దులతో ఉన్నందున అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా పనిచేయాలని అఖిల్ మహాజన్ సూచించారు.