ADB: పారిశుధ్యం పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి కుమ్ర మోతిరాం అన్నారు. గురువారం నార్నూర్ మండల కేంద్రంలోని విజయనగర్ కాలనిలో శానిటైజేషన్ చేపట్టారు. సీజనల్ వ్యాధులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డా.జితేందర్, తులసీదాస్, ఆశ కార్యకర్తలు లక్ష్మి బాయి, జ్యోతి, సుగుణ తదితరులు పాల్గొన్నారు.