JGL: గ్రామ సభలు, వార్డు సభల పేరుతో ప్రజాధనం వృథా అవుతోందని మాజీ జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్ విమర్శించారు. బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సమస్యలకు పరిష్కారం చూపని సభలు ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. గతంలో తీసుకున్న దరఖాస్తుల్లో ఒక్కటికైనా పరిష్కారం దొరికిందా అని నిలదీశారు.