MHBD: పేద ప్రజలకు అండగా నిలిచిన సీపీఎం నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గునిగంటి రాజన్న పేర్కొన్నారు. అరెస్టు చేసిన సీపీఎం నాయకులను భేషరతుగా విడుదల చేయాలని, చిన్న చిన్న కారణాలను సాకుగా చూపిస్తూ నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు.