నిర్మల్ జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించిన మక్కలు, వరి, జొన్నల కొనుగోళ్లు, రవాణా ప్రక్రియలు వేగంగా జరుగుతున్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియను గడువులోగా పూర్తి చేస్తామని, అధికారులు క్షేత్రస్థాయిలో కొనుగోళ్లను పర్యవేక్షిస్తున్నారని ఆయన వివరించారు.