PDPL: పవర్ హౌస్ కాలనీలోని సింగరేణి క్వార్టర్స్‌లో గురువారం విష సర్పం కలకలం సృష్టించింది. సత్యనారాయణ ఇంట్లోకి పాము రావడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో అడ్డగుంటపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ అబ్బాస్ అక్కడికి చేరుకుని, ఆ పామును చాకచక్యంగా పట్టుకుని సంచిలో బంధించారు. దానిని నిర్మానుష్య ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు.