BHNG: కాంగ్రెస్ పార్టీలో సరైన ప్రాధాన్యత లభించట్లేదని ఆరోపిస్తూ హోలియా దాసరి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టంటం జహంగీర్, బీబీనగర్ మాజీ ఎంపీటీసీ టంటం భార్గవ్ బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీబీనగర్ పట్టణ కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వారు వెల్లడించారు.