NRML: ఖానాపూర్ మండలం కొత్తపేట గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనంను ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ప్రారంభించారు. టెంకాయ కొట్టి రిబ్బన్ కట్ చేశారు. సర్పంచ్ని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.