GDWL: గట్టు మండలంలోని మాచర్ల గ్రామంలో సోమవారం వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని 7వ వార్డు సభ్యుడు భీమేష్ నాయుడు మిషన్ భగీరథకు చెందిన పైపుల లీకేజీ, వాల్వ్ సమస్యలను తన సొంత ఖర్చుతో మరమ్మతు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానికులకు నీటి సరఫరా సక్రమంగా అందేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.